English | Telugu
రెండో పెళ్లి కూడా పెటాకులేనా! పాపం ఆ డైరెక్టర్!
Updated : Dec 16, 2025
-విడాకులు నిజమేనా!
-అసలు ఏం జరుగుతుంది
- ఆ ఇద్దరు క్లారిటీ ఇస్తారా!
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల గురించి చెప్పుకుంటే అందులో ఖచ్చితంగా 'సెల్వ రాఘవన్'(Selvaraghavan)ఉంటాడు. 7 /జి బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకి అర్దాలు వేరులే, మయక్కం ఎన్నా, నెంజమ్ మరప్పతిల్లై వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రతిభావంతమైన నటుల గురించి చెప్పుకోవాలన్నా అందులో సెల్వ రాఘవన్ పేరు ఉంటుంది. బీస్ట్, సాని కాయిధమ్, నానే వరువేన్, బకాసురన్, మార్క్ ఆంటోనీ, రాయన్ తో పాటు రీసెంట్ గా వచ్చిన ఆర్యన్ వంటి చిత్రాలే ఉదాహరణ.
సెల్వ రాఘవన్ 2011 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకురాలు 'గీతాంజలి'(Gitanjali)ని వివాహం చేసుకున్నాడు. సెల్వ రాఘవన్ కి ఇది రెండో వివాహం. మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ 7 /జి బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia Agarwal)తో జరిగింది. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. 2006లో వీరి పెళ్లి జరగగా మనస్పర్థలు తలెత్తడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతనే గీతాంజలి ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ ఒకటి తమిళ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also read: సుజిత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా
ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గీతాంజలి ఇనిస్టాగ్రమ్ లో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడమే. పెళ్లయిన 14 ఏళ్లకి అలా ఉన్నట్లుండి పిక్స్ డిలేట్ చేయడంతోనే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మాటలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.