English | Telugu
`అంటే.. సుందరానికీ`తో మరోసారి కలిసొస్తుందా!
Updated : May 30, 2022
`మెంటల్ మదిలో` (2017)తో దర్శకుడిగా తొలి అడుగేసిన వివేక్ ఆత్రేయ.. మొదటి ప్రయత్నంలోనే తనదైన ముద్రవేశాడు. ఆపై రెండో చిత్రమైన `బ్రోచేవారెవరురా` (2019)తో కెప్టెన్ గా ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ చూశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు `అంటే.. సుందరానికీ!` అంటూ మరోసారి పలకరించబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని, కేరళకుట్టి నజ్రీయా జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. వేసవి కానుకగా జూన్ 10న విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వివేక్ ఆత్రేయకి నిర్దేశకుడిగా తొలి విజయాన్ని అందించిన `బ్రోచేవారెవరురా` కూడా గతంలో ఇదే జూన్ నెలలోనే విడుదలైంది. మరి.. మళ్ళీ మూడేళ్ళ తరువాత తన నుంచి వస్తున్న `అంటే.. సుందరానికీ` కూడా అదే బాటలో పయనించి వివేక్ ఖాతాలో మరో సక్సెస్ ని చేరుస్తుందేమో చూడాలి.
కాగా, `అంటే.. సుందరానికీ!`లో నదియా, నరేశ్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, సుహాస్, హర్షవర్థన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.