English | Telugu

'రానా నాయుడు'కి గుమ్మడికాయ కొట్టేశారు

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలయికలో మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా రాకపోయినా 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ని సుప‌ర్ణ్‌ వ‌ర్మ‌తో క‌లిసి క‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే ఈ సిరీస్ స్క్రీనింగ్ కానుందని తెలిపింది.

అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ 'రే డోనోవన్' ఆధారంగా రూపొందుతోన్న ఈ సిరీస్ లో గ్యాంగ్ స్టర్ గా వెంకటేష్, ఆయన తనయుడిగా రానా కనిపించనున్నారని తెలుస్తోంది. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయిలైన వెంకీ-రానాలు స్క్రీన్ పై తండ్రీకొడుకులుగా కనిపించడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.