English | Telugu

కోహ్లీ పై కన్నేసిన సీత

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో సీతగా మంచి పేరు తెచ్చుకున్న నటి అంజలి. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి ఇటీవలే సీత వలె కష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కోర్టు కేసు కొట్టివేయడంతో ఈ అమ్మడు ప్రస్తుతం సంతోషంగానే ఉంది. దీంతో అంజలి తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త క్రికెటర్ విరాట్ కోహ్లీ ల ఉండాలని కోరుకుంటుంది. అలాంటి వాడైతే తనకు చాలా ఇష్టమని అంజలి చెపుతుంది. తను త్వరలోనే పేదల కోసం ఓ అనాధ ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.