English | Telugu
కియారకి శంకర్ స్పెషల్ గిఫ్ట్!
Updated : Jul 30, 2023
కియారా అద్వానీకి స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు శంకర్. రేపు(జూలై 31న) కియారా బర్త్ డే. పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ముందుగానే భర్తతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు కియారా. ఆమె ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్ పక్కన శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ని సోమవారం విడుదల చేస్తారని టాక్.
ఇటీవల కొంతకాలంగా గేమ్ చేంజర్ గురించి అసలు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. శంకర్ పూర్తిగా ఇండియన్2కి పరిమితమయ్యారు. రామ్‌చరణ్ తన తనయ క్లీంకారతో బిజీ అయ్యారు. అందుకే మళ్లీ సినిమా మూడ్‌లోకి ఫ్యాన్స్ ని తీసుకుని రావాలంటే, ఇంతకన్నా బెస్ట్ అకేషన్ ఉండదని అనుకుంటున్నారట మేకర్స్. దీని గురించి అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటనా లేదు. కాకపోతే రామ్‌చరణ్ పుట్టినరోజున ఆయన ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. అదే క్రమంలో కియారా పుట్టినరోజున ఆమె లుక్ రిలీజ్ చేస్తారనే ఎదురుచూపులున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు కియారా. ఆమె నటించిన లాస్ట్ మూవీ సత్యప్రేమ్‌కి కథ చాలా పెద్ద హిట్ అయింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయిపోయామంటున్నారు ఫ్యాన్స్.
పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో అసలు ఏమాత్రం తగ్గలేదు కియారా. తన గురించి రకరకాలుగా రాసేవారి గురించి ఒకరోజు కియారా ఫీల్ అయ్యారట. అది ప్రొఫెషన్ అని, అక్కడ అలాగే ఉండాలని ఆమె భర్త సపోర్ట్ చేశారట. దీన్ని బట్టి శంకర్ సినిమాలోనూ కియారా అందాల ఆరబోత ఒక రేంజ్‌లో ఉంటుందన్నది ఫ్యాన్స్ గెస్.
శంకర్‌తో పనిచేయడం వల్ల కెరీర్‌లో ఎంతో నేర్చుకున్నట్టు ఆల్రెడీ చెప్పారు కియారా. రామ్‌చరణ్‌తో ఆమె నటించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు, ఇంతకు ముందు వినయవిధేయరామలో నటించారు ఈ ఇద్దరూ.