English | Telugu
చెన్నై రైలెక్కిన చిన్నది
Updated : Jul 27, 2013
బెజవాడ సినిమాలతొ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల భామ అమలా పాల్.. తొలి సినిమా సక్సెస్‌ను అందించలేకపోయిన అమలా పాల్ మాత్రం ఆకట్టుకుంది.. దీంతో ఈ అమ్మడు ఇక టాలీవుడ్‌ను ఊపేస్తుంది అనుకున్నారు అంతా.. కాని అమల తరువాత నటిచిన లవ్ ఫెయిల్యూర్ సినిమా కూడా నిరాశపరచడంతొ అమలపాల్‌కు ఆశించిన స్ధాయి అవకాశాలు రాలేదు.. కాని తొలి రెండు సినిమాల్లో గ్లామర్‌తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాదించటం.. వరుసగా ఇద్దరు మెగా హీరోలతో నటించే చాన్స్ కొట్టేసింది..
రామ్‌చరణ్ హీరో వినాయక్ డైరెక్షన్‌తో తెరకెక్కిన నాయక్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అమల.. ఈ సినిమా మంచి సక్సెస్ సాదించటంతో పాటు చెర్రీ లాంటి టాప్ స్టార్ సరసన నటించటంతో ఈ అమ్మడి పంట పండింది అనుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే వెంటనే మరో మెగా హీరో అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది.. మరోసారి ఈ సినిమా ఆశించిన స్ధాయి విజయం సాదించక పోవటంతో అమలకు టాలీవుడ్‌లో అవకాశాలే లేకుండా పోయాయి..
దీంతో ఇప్పుడు చెన్నై చెక్కేసింది ఈ భామ..తాజాగా విజయ్ సరసన హీరోయిన్‌గా నటించిన తలైవా సినిమా ఈ ఆగస్టు 7 రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఇక అక్కడ తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది..