English | Telugu
మృణాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్
Updated : Oct 30, 2023
సీతారామం చిత్రంలో సీతగా మెప్పించిన బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ త్వరలోనే హాయ్ నాన్న చిత్రంతో అలరించటానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈమె త్వరలోనే ఓ హైదరాబాద్ అబ్బాయిని చూసుకుని సెటిలవ్వాలంటూ ఓ అగ్ర నిర్మాత ఆశీర్వాదాన్ని అందించారు. ఆయనలా చెప్పటానికి కారణమేంటి? ఎవరా నిర్మాత? సౌత్, నార్త్‌ల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై మనసు పడిందా? ఈమె త్వరలోనే తెలుగింటి కోడలు కానుందా? అనే వివరాల్లోకి వెళితే..
రీసెంట్‌గా దుబాయ్‌లో సైమా అవార్డుల వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించినందుకుగానూ మృణాల్ ఠాకూర్‌కి ఉత్తమ హీరోయిన్‌గా అవార్డ్ దక్కింది. ఈ అవార్డుని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అందించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. త్వరలోనే హైదరాబాద్ అబ్బాయిని చూసుకుని టాలీవుడ్‌కి వచ్చెయ్ అని అరవింద్ అన్నారు. అంతే కాదండోయ్..గతంలో ఓ హీరోయిన్‌తో ఇదే మాట అన్నాను. ఆమె ఇప్పుడు ఓ హీరోని పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా టాలీవుడ్‌కి కోడలుగా వచ్చెయ్ అన్నారు.
అయితే ఈ వీడియో చూసిన వారు అరవింద్ కామెడీగా ఆ మాట అన్నారా? లేక నిజంగానే మృణాల్ ఠాకూర్ ఎవరైనా తెలుగు హీరోతో ప్రేమలో ఉందా? అని అనుకుంటున్నారు. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అరవింద్ ఇలాగే అన్నారు. ఆమె ఇప్పుడు మెగా ఇంటి కోడలు కానుంది. నవంబర్ 1న వరుణ్ తేజ్‌ను ఇటలీలో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరిప్పుడు మృణాల్ ఠాకూర్ విషయంలో అరవింద్ జోస్యం నిజమవుతుందేమో చూడాలి మరి. ఇక సినిమాల విషయానికి వస్తే నాని హీరోగా సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్ని సినిమాలో మృణాల్ హీరోయిన్. డిసెంబర్ 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
