English | Telugu
అలియాభట్ ఇంటికి కర్ణాటక వినాయకుడు..ప్రత్యేకతలు ఇవే
Updated : Oct 16, 2025
భారతీయ చిత్రపరిశ్రమలో అలియాభట్(Alia Bhatt),రణబీర్ కపూర్(Ranbir Kapoor)జంటకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇద్దరు తమ సినీకెరీర్ పీక్ లో కొనసాగుతున్నప్పుడే వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం కూడా అదే స్థాయిలో విజయాల్ని అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నారు. 'రామాయణ'(Ramayana)తో రణబీర్ బిజీగా ఉండగా, అలియాభట్ 'ఆల్ఫా' అనే చిత్రంతో బిజీగా ఉంది. సదరు చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.
అలియాభట్ దంపతులు ఈ నెల 17 న ముంబై(Mumbai)లోని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఈ మేరకు ఇంట్లో గణపతి(Ganapathi)విగ్రహాన్ని ప్రతిష్టించడం కోసం కర్ణాటకలోని మైసూరుకి చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు 'అరుణ్ యోగిరాజ్' కి కొన్నినెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు. దీంతో అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj)నల్లఏకశిలపై చెక్కిన అందమైన గణపతిని రూపొందించాడు. భక్తులని ఎంతగానో కట్టిపడేసేలా ఉన్న ఆ అందమైన గణనాధుడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండగా, విగ్రహాన్ని చెక్కడానికి యోగిరాజ్ కి ఆరునెలల సమయం పట్టింది. రీసెంట్ గా గణనాధుడి విగ్రహం అలియాభట్ ఇంటికి చేరగా, యోగిరాజ్ కి ఎంత డబ్బులు చెల్లించారనే విషయం మాత్రం బయటకి రాలేదు.
అయోధ్య బాల రాముడ్ని(Ayodhya Balaramudu)కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. సదరు బాల రాముడ్ని చూస్తు భక్తులందరు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నారు.