English | Telugu
మీతోనే చెప్తాను: అఖిల్
Updated : Jul 26, 2013
నాగార్జున తనయుడు అఖిల్ సినీరంగ ప్రవేశంపై గతకొద్ది రోజులుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అఖిల్ తన మనసులోని మాటలను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
"నా సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాను. నా సినిమాకు సంబంధించిన ఏ సమాచారం అయినా కూడా నేనే స్వయంగా మీతో పంచుకుంటాను" అని తెలియజేసాడు. మరి అఖిల్ తన సినిమా ఎంట్రీ గురించి మరోసారి పెదవి విప్పే వరకు వేచి ఉండాల్సిందే.