English | Telugu

థియేట్రికల్‌ రైట్స్‌లోనూ రికార్డు క్రియేట్‌ చేస్తున్న ‘అఖండ2’

- బాలయ్య సినిమాల్లో అఖండ2 ప్రత్యేకం

- అఖండ2లో బాలయ్య నట విశ్వరూపం

- బాలయ్య, బోయపాటి సెకండ్ హ్యాట్రిక్‌కి శ్రీకారం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతూ ప్రారంభమైన ‘అఖండ2’ చిత్రానికి మొదటి నుంచీ విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది. సినిమాలో ప్రధానంగా కనిపించే అఘోరా క్యారెక్టర్‌లో నందమూరి బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌ని బట్టి తెలుస్తోంది. ‘అఖండ.. తాండవం..’ అంటూ ఇటీవల రిలీజ్‌ అయిన పాట అన్నిచోట్లా మారు మోగిపోతోంది. అఖండ చిత్రంలో ఒక భాగంగా మాత్రమే ఉన్న అఘోరా క్యారెక్టర్‌ అఖండ2లో చాలా విస్తృతంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఆ క్యారెక్టరే హైలైట్‌ అవ్వబోతోంది.

14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బాలకృష్ణను ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించడంలో బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలోని రెండు క్యారెక్టర్లను డిజైన్‌ చేశారు. దేనికదే అన్నట్టుగా ఈ రెండు క్యారెక్టర్లు ఉంటాయని తెలుస్తోంది. ఆధ్యాత్మికంగా వెళ్లే అఘోరా క్యారెక్టర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా సాగే మురళీకృష్ణ క్యారెక్టర్‌ను బ్యాలెన్స్‌ చేశారని, ఇది ప్రేక్షకులకు, అభిమానులకు ఫుల్‌ పైసా వసూల్‌ సినిమా అవుతుందని అని చెబుతున్నారు.

బాలకృష్ణ, సంయుక్త మీనన్‌పై చిత్రీకరించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ సాంగ్‌ ‘జాజికాయ జాజికాయ..’ సాంగ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. సినిమాలో ఉన్న ఒకే ఒక మాస్‌ సాంగ్‌ ఇదని బోయపాటి ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఎంతో స్పెషల్‌ కేర్‌ తీసుకొని ఈ పాటను ఎంతో భారీగా చిత్రీకరించారు బోయపాటి. సినిమాటోగ్రఫీ, తమన్‌ మ్యూజిక్‌ టెక్నికల్‌గా ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే అంశాలు కాబోతున్నాయి. సినిమాలోని ఒరిజినల్‌ లొకేషన్లు సినిమాకి చాలా ప్లస్‌ అవుతాయి.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకొని డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘అఖండ2’ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి జరిగిన థియేట్రికల్‌ బిజినెస్‌ పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ కెరీర్‌లో మునుపెన్నడూ లేని క్రేజ్‌ను ట్రేడ్‌లో సొంతం చేసుకుంది అఖండ2. థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా భారీ ఎత్తున జరిగిందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో థియేట్రికల్‌ రైట్స్‌కి భారీ పోటీ ఎదురైంది. ఏరియాల వైజ్‌గా అఖండ2 చిత్రానికి జరిగిన థియేట్రికల్‌ బిజినెస్‌ ఎలా ఉందో పరిశీలిద్దాం.

ఉత్తరాంధ్ర ఏరియాను గాయత్రి దేవి ఫిలింస్‌ సతీష్‌ 13 కోట్ల 50లక్షలకు తీసుకున్నారు. గుంటూరు ఏరియా రైట్స్‌ను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 9 కోట్ల 50 లక్షలకు దక్కించుకున్నారు. ఇక ఈస్ట్‌గోదావరిని విజయలక్ష్మీ సినిమాస్‌ 8 కోట్ల 25 లక్షలకు, వెస్ట్‌ గోదావరి6 కోట్ల 50 లక్షలకు, నెల్లూరును కావలి భరత్‌ 4 కోట్ల 40 లక్షలకు, సీడెడ్‌ను శోభన్‌ 24 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక అతి పెద్దదైన నైజాం ఏరియా రైట్స్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏరియా రైట్స్‌ను నిర్మాతలు 30 కోట్లకు కోట్‌ చేసినట్టు తెలుస్తోంది.

థియేట్రికల్‌ రైట్స్‌కి జరిగిన బిజినెస్‌ చూస్తుంటే ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమాకీ ఈ రేంజ్‌ ఫిగర్స్‌ కనిపించలేదు. దీన్నిబట్టి రిలీజ్‌కి ముందే బిజినెస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా.. ఎప్పుడెప్పుడు నటసింహ నట విశ్వరూపాన్ని తెరపై చూస్తామా అని ప్రేక్షకులు, అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ‘అఖండ2’ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అభిమానులు ఎంతో ఆనందంగా చెబుతున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే.. ‘అఖండ2’ మరొక ఎత్తుగా నిలుస్తుందని ట్రేడ్‌వర్గాలు సైతం చెప్పడం విశేషం.