English | Telugu
అఖండ 2 టీజర్ లోని బాలయ్య డైలాగ్ పై వేరే హీరో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Updated : Oct 25, 2025
తనని గాడ్ ఆఫ్ మాసెస్ అని ఎందుకు అంటారో నందమూరి నటసింహం పద్మభూషణ్ 'బాలకృష్ణ'(Balakrishna)నిన్న విడుదలైన అఖండ 2(Akhanda 2)టీజర్ తో మరోసారి నిరూపించాడు. అఘోర క్యారక్టర్ కాకుండా రెండో క్యారక్టర్ పరిచయానికి సంబంధించి రిలీజ్ చేసిన సదరు టీజర్,సుమారు 55 సెకన్ల నిడివితో ఉంది. బాలయ్య శత్రువులని చీల్చి చెండాడుతు కనపడిన టీజర్ ని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న బాలయ్య అభిమానులు తమ సెల్ ఫోన్ స్టేటస్ గా యూజ్ చేస్తున్నారు. యూ ట్యూబ్ లో కూడా మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ రికార్డు ఎంత నెంబర్ దగ్గర ఆగుతుందో తెలియని పరిస్థితి.
ముఖ్యంగా బాలకృష్ణ తన శత్రువుతో చెప్పిన 'సౌండ్ కంట్రోల్ లో ఉంచుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడకా. నీ ఊహకి కూడా అందదు' అనే డైలాగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పెద్ద సునామిని సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ సెట్టర్ గా మారడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా రీల్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో అఖండ 2 ఫీవర్ ఇప్పట్నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక జనరల్ గా ప్రతి హీరోకి నెగిటివ్ ఫ్యాన్స్ ఉండటం సహజం. బడా హీరో సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందరి హీరోల అభిమానులు అఖండ 2 టీజర్ సూపర్ గా ఉందంటున్నారు. మరో సారి సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య విజృంభించబోతున్నాడని, అఖండ 2 బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే మాటలు కూడా ఇతర హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా ముందు రోజు నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ పడనున్నాయి. బోయపాటి(Boyapati srinu)అఖండ 2 షూటింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని తో కలిసి 'లెజండ్' ని నిర్మించిన 14 రీల్స్ బాలయ్య కెరీర్ లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది, భీమ్లా నాయక్, విరూపాక్ష, బింబిసార ఫేమ్ సంయుక్త మీనన్(Samyuktha Menon)హీరోయిన్ కాగా ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty)ప్రతి నాయకుడుగా కనిపించబోతున్నాడు.