English | Telugu

ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.. ఎక్స్ వేదికగా స్పందించిన రష్మిక 

శుక్రవారం తెల్లవారుజామున ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయేలా హైదరాబాద్(Hyderabad)నుంచి బెంగుళూరు(Bengaluru)వెళ్తున్న ప్రవైట్ బస్ కర్నూలు(Kurnool) సమీపంలోని చిన్నటేకూరు(Chinna tekur)జాతీయ రహదారి వద్ద అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అందరి శరీరాలు మాంసం ముద్దలుగా మిగిలాయి.వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరం.

ఈ విషయంపై రష్మిక స్పందిస్తు కర్నూల్ బస్ ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. ఆ వార్త వినగానే నా హృదయం ముక్కలయ్యింది.ఎంతగానో బాధపడుతున్నాను. మండుతున్న బస్ లోపల చనిపోయిన ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం.కాలిపోయే ముందు వాళ్ళ ఎంత బాధ పడ్డారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.ఇందులో ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నాని ఎక్స్ వేదికగా తెలిపింది.

సోనుసూద్(Sonu Sood),కిరణ్ అబ్బరం(Kiran Abbavaram)తో పాటు చాలా మంది నటులు,నటీమణులు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఇక బైక్ ని ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్ బస్ ని వెంటనే ఆపి ఉంటే అందరి ప్రాణాలు మిగిలేవి. అలా చేయకుండా బైక్ ని సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.దీంతో బైక్ కి చెందిన పెట్రోల్ పంప్ మూత ఊడిపోవడంతో అగ్గి రవ్వలు చెలరేగి బస్ మొత్తం వ్యాపించడంతో బస్ అగ్నికి ఆహుతయినట్టుగా తెలుస్తుంది. బస్ కి చెందిన సెన్సర్లు పనిచేయక పోవడంతో ఆటోమేటిక్ డోర్స్ లాక్ అవ్వడం కూడా ప్రమాద తీవ్రతకి కారణమని తెలుస్తుంది. దీంతో రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా కఠినమైన నిబంధనలు అమలు చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.