English | Telugu
'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖండకు రెట్టింపు..!
Updated : Dec 12, 2025
'అఖండ 2: తాండవం'తో తాజాగా నందమూరి బాలకృష్ణ థియేటర్లలో అడుగుపెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. (Akhanda 2: Thaandavam)
2021లో విడుదలైన 'అఖండ' కరోనా పాండమిక్ టైంలో తక్కువ టికెట్ ధరలతో విడుదలైంది. అయినప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ తో ఘన విజయం సాధించింది.
Also Read: 'అఖండ-2'లో శివుడిగా మెప్పించిన నటుడు ఎవరో తెలుసా?
'అఖండ'కి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందింది. అసలే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 20 వేల రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.60-70 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి అఖండ మొదటి భాగానికి రెట్టింపు ఓపెనింగ్స్ కావడం విశేషం.
ఫస్ట్ వీకెండ్ లోనే 'అఖండ 2' రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందనే అంచనాలున్నాయి. అంటే 'అఖండ' ఫుల్ రన్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లోనే సీక్వెల్ క్రాస్ చేయనుందన్నమాట.