English | Telugu
'అఖండ-2'లో శివుడిగా మెప్పించిన నటుడు ఎవరో తెలుసా?
Updated : Dec 12, 2025
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లన్నీ శివాలయాలను తలపిస్తున్నాయి. అఖండగా బాలయ్య చేసిన తాండవానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (Akhanda 2: Thaandavam)
'అఖండ 2' విడుదలకు కొద్దిరోజుల ముందు నుంచి.. ఇందులో శివుడి పాత్ర గురించి చర్చ జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి సీనియర్ ఎన్టీఆర్ ని శివుడిగా చూపిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది. శివుని పాత్రలో ఒక ప్రముఖ నటుడు దర్శనమిచ్చాడు.
'అఖండ 2' చిత్రంలో శివుడిగా బాలీవుడ్ యాక్టర్ తరుణ్ ఖన్నా నటించాడు. వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా తనదైన గుర్తింపు పొందిన తరుణ్ ఖన్నా.. పౌరాణిక పాత్రలతో ప్రత్యేక పేరుని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా టీవీ సిరీస్ లలో శివుడి పాత్రలకు పెట్టింది పేరు అన్నట్టుగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
2015లో ప్రసారమైన 'సంతోషి మా'లో శివుడిగా మెప్పించిన తరుణ్ ఖన్నా.. ఆ తర్వాత దాదాపు పది టీవీ సిరీస్ లలో శివ పాత్రలో కనువిందు చేశాడు. శివుడిగా హిందీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తరుణ్ ఖన్నా.. ఇప్పుడు అఖండ-2లో మరోసారి శివ పాత్రలో నటించి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.