English | Telugu

స్టార్ మాత్రమే కావాలంటున్న ఐశ్వర్య

యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు వారందరికి సుపరిచితమే. అర్జున్ కూతురు ఐశ్వర్యరాయ్ కూడా ఇటీవలే తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం "పట్టత్తు యానై". ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది ఐశ్వర్య.

ఈ చిత్రం ఇటీవలే విడుదలై.. మొదటిరోజే ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో తమిళ ఇండస్ట్రీని మొత్తం ఒక్కసారిగా తన వైపుకు తిప్పేసుకుంది ఐశ్వర్య. అయితే ఈ సినిమా సక్సెస్ లో ఉన్న ఐశ్వర్య.. తెలుగులో మంచి ఛాన్స్ వస్తే చేస్తానంటుంది. కానీ అదికూడా స్టార్ హీరోల పక్కన మాత్రమేనని కండిషన్స్ కూడా పెట్టేసింది. మరి ఈ అమ్మడు తెలుగులో త్వరలోనే ఓ స్టార్ హీరో పక్కన కనపడబోతుందన్నమాట.