English | Telugu
కేసు నుండి తప్పించుకున్న అంజలి
Updated : Jul 17, 2013
ఇటీవలే అంజలి నటించిన "బలుపు" చిత్రం విజయం సాధించడంతో ఆనందంతో ఉన్న హీరోయిన్ అంజలికి మరో సంతోషకరమైన వార్త తెలిసింది. గతకొద్ది రోజులుగా అంజలిపై కోర్టులో కేసు నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమెపై ఉన్న కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఆమె పిన్ని భారతీదేవి రాజీకి వచ్చి న్యాయస్థానంలో అంజలిపై ఉన్న కేసును ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీంతో అంజలికి కాస్త మనశ్శాంతి లభించినట్లయింది.