English | Telugu

మూడో పెళ్ళికి సిద్ధమైన నటుడు

నటుడు శరత్ బాబు త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నాడట. మొదటగా సినీ నటి రమాప్రభని వివాహం చేసుకొని, 1988లో ఆమెకు విడాకులిచ్చేసాడు శరత్ బాబు. ఆ తర్వాత స్నేహలతని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ కొంత కాలం తర్వాత 2011లో స్నేహలత కూడా శరత్ కు విడాకులు తీసుకోని, అతని నుండి వేరుగా ఉంటుంది. అయితే 61 ఏళ్ల వయసులో కూడా ఇంకా యూత్ లా ఫీల్ అవుతున్న శరత్ బాబు ముచ్చటగా మూడో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అయితే తను పెళ్లి చేసుకునే ఆ యువతి పేరును చెప్పడానికి మాత్రం శరత్ బాబు పెదవి విప్పట్లేదు కానీ, ఆమె ఒక జర్నలిస్ట్ అని చెప్పడం కొసమెరుపు. మరి త్వరలోనే శరత్ బాబు మూడో ఇంటివాడు కానున్నాడన్నమాట.