English | Telugu

అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?

స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ(RaviTeja) ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాప్ స్టార్స్ కి పోటీగా కలెక్ట్ చేసేవి. అలాంటి రవితేజ, ఇప్పుడు వెనకబడిపోయారు. వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాలు రూ.10 కోట్ల షేర్ రాబట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అసలు రవితేజకి ఏమైంది? ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి? అనే చర్చ జరుగుతోంది.

రవితేజ అంటే యాక్షన్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు. కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ తో.. ఫుల్ మీల్స్ లా ఆయన సినిమాలు ఉండేవి. మధ్య మధ్యలో ప్రయోగాలు చేసి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అదిరిపోయే కమర్షియల్ సక్సెస్ లు చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ సక్సెస్ లు ఆయనను పెద్దగా పలకరించడం మానేశాయి.

ఎలాంటి సినిమాలు చేయాలి? అనేది ఇప్పుడు రవితేజకు పెద్దగా క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది. ప్రయోగాలు చేస్తే.. ఇలాంటి సినిమాలు వద్దు, వింటేజ్ రవితేజను గుర్తుచేసే ఎంటర్టైనర్స్ కావాలని అభిమానులు కోరుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే.. ఇంకెంత కాలం ఇవే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, అవే హీరోయిన్ తో స్టెప్పులు.. కొత్త తరహా సినిమాలు చేయమని అంటున్నారు. దీంతో సినిమాల ఎంపికలో రవితేజ తడబడుతున్నారని అర్థమవుతోంది.

Also Read: గ్లోబ్ ట్రాటర్.. సౌండ్ లేకుండా వచ్చిన సాంగ్.. రెస్పాన్స్ ఎలా ఉంది?

ఇటీవల 'మాస్ జాతర'తో నిరాశపరిచిన రవితేజ.. 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. కొందరు ఇది కూడా రెగ్యులర్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఆడియన్స్ మాత్రం గ్లింప్స్ బాగుందని, సంక్రాంతికి కరెక్ట్ సినిమా అని, ఇలాంటి సినిమాలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. (Bhartha Mahasayulaku Wignyapthi)

నిజానికి ఆడియన్స్ ని మెప్పించాలంటే జానర్ ముఖ్యం కాదు. ఏ జానర్ అయినా కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. రవితేజ నటించిన క్రాక్, మాస్ జాతర సినిమాలనే గమనిస్తే.. రెండూ యాక్షన్ ఎంటెర్టైనర్సే. కానీ, కంటెంట్ పరంగా క్రాక్ మెప్పించింది. అంటే రవితేజ ఎలాంటి సినిమా చేసినా.. కంటెంట్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు కొందరు అభిమానులు రవితేజకు సూచిస్తున్నారు. చూద్దాం మరి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తోనైనా రవితేజ హిట్ ట్రాక్ లోకి వస్తారేమో.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.