English | Telugu

నీ స్థాయికి ఇలాంటి పనులు అవసరమా ప్రభాస్..?

ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఆఫ్ స్క్రీన్ లో ఆయన ప్రవర్తన, మంచితనం చూసి.. ఇతర హీరోల అభిమానులు సైతం ఆయనను ఇష్టపడుతుంటారు. వివాదాల జోలికి పోవడం గానీ, అనవసరమైన పబ్లిసిటీ స్టంట్స్ చేయడం గానీ.. ప్రభాస్ చేయరు. అందుకే ఆయన అందరి డార్లింగ్ అయ్యారు. అలాంటి ప్రభాస్ తాజాగా చేసిన ఓ పని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సడెన్ గా పెళ్లి గురించి హింట్ ఇస్తున్నట్టుగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఓ స్టోరీ పెట్టాడు. "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ అందులో రాసుకొచ్చాడు. దీంతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, లైఫ్ పార్టనర్ ని త్వరలోనే పరిచయం చేయబోతున్నాడని భావించారంతా. కానీ అది సినిమా ప్రమోషన్ అని తెలిసి అందరూ షాకయ్యారు.

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) జూన్ 27న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ భైరవగా కనిపిస్తుండగా, ఆయన ఉపయోగించే అడ్వాన్స్డ్ వెహికిల్ బుజ్జిగా కనిపించనుంది. తాజాగా బుజ్జి రోల్ గురించి అప్డేట్ వచ్చింది. దీంతో, ఈ బుజ్జి గురించే ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ "స్పెషల్ పర్సన్" అని రాసుకొచ్చాడని అర్థమైపోయింది.

ప్రభాస్ స్థాయికి ఇలాంటి ప్రమోషన్స్ అవసరంలేదు. నిజానికి ఆయన కూడా సినిమా కోసం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసే రకం కాదు. అలాంటి ప్రభాస్ ఓ సినిమా ప్రమోషన్ కోసం.. ఇలా పెళ్లి అన్నట్టుగా అటెన్షన్ క్రియేట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభాస్ పేరే ఒక బ్రాండ్. ఆయన సినిమాలకు ఇటువంటి ప్రమోషన్స్ అవసరంలేదు. డార్లింగ్ తన స్థాయిని మరిచి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం అవసరమా? అని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.