English | Telugu

Vivekanandan viral movie review: వివేకానందన్ వైరల్ మూవీ రివ్యూ

మూవీ: వివేకానందన్ వైరల్
నటీనటులు: షైన్ టామ్ చాకో, శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్ళై, పార్వతీ మలా, నీనా కురుప్ తదితరులు
ఎడిటింగ్: రంజన్ అబ్రహం
సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుదన్
మ్యూజిక్: బిజ్బల్
నిర్మాతలు: :నెడియత్ నసీబ్, పిఎస్ షెల్లీరాజ్
రచన, దర్శకత్వం: కమల్

దసరా మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ తెచ్చుకున్న షైన్ టామ్ చాకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. గతేడాది మలయాళంలో రిలీజై అక్కడ విజయం అందుకున్న మూవీ ' వివేకానందన్ వైరల్'. ఈ మూవీని ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

వివేకనందన్(షైన్ టామ్ చాకో) కేరళలోని ఓ ఊర్లో భార్య సితార, తల్లితో కలిసి ఉంటాడు. అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో జాబ్ చేస్తుంటాడు. అయితే వివేకానందన్ కి డయానా అనే మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కూడా ఉంటుంది. ఇలా ఇద్దరు భార్యలను చేసుకొని వాళ్లను వేధిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంకా అతను బలానికి లేహ్యం తింటుంటాడు. దానివల్ల ఇద్దరి భార్యలని శారీరకంగా హింసిస్తుంటాడు. ఇక అతని బాధని తట్టుకోలేక డయాన తన ఫ్రెండ్ సాయం కోరగా, వివేకానందన్ వాళ్ళ భార్యని కలవమని చెప్తుంది. అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్లంతా కలిసి ఏం చేశారు? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ కథ కామెడీ జానర్ లో తెరకెక్కించినప్పటికి ఒక సీరియస్ మెసెజ్ ని ఇస్తుంది. అయితే ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమా. భార్యాభర్తల మధ్య సాగే కొన్ని సీన్లని చూపించారు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వివేకానందన్ కి కనపడిన ప్రతీ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని చూడటం, దానివల్ల అతనికి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని చక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలో కామెడీ లోపించింది.

డ్రామా అనేది రెండు గంటల పాటు సాగుతుంది. అయితే ఇలా అంతసేపు ఒకే కంటెంట్ పై సాగడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తన భార్య శరీరంపై భర్తకి సర్వ హక్కులు ఉన్నాయనే ధోరణిలో అతని పైశాచికత్వాన్ని చూపించిన దర్శకుడు... ముగ్గురు అమ్మాయిలు కలిసి అతనికి స్వేచ్ఛ లేకుండా చేయడాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు. ఇది వన్ సైడెడ్ గా సాగే కథ. భార్యాభర్తల మధ్య మరో వ్యక్తి రావడం దానిని పదేపదే చూపించడం.. ఎంతమాత్రం కథ ముందుకు సాగకుండా అక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది.

భార్యాభర్తల మధ్య సాగే ఓ సీరియస్ ఇష్యూని ఏకంగా లైవ్ ఇవ్వడం.. అతడిని బ్యాడ్ అంటూ వైరల్ చేయడం కాస్త లాజిక్ లెస్ గా ఉంటుంది. అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉండటంతో అడల్ట్స్ మాత్రమే దీనిని చూడొచ్చు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుందనుకొని చూస్తే పొరపాటే అవుతుంది. అంతలా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఒకే. మ్యూజిక్ పర్వాలేదు . నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

వివేకానందన్ గా షైన్ టామ్ చాకో నటన ఆకట్టుకుంది. ఇక మిగతా వారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా : బోరింగ్ వివేకానందన్ వైరల్... పెద్దవాళ్ళలకి మాత్రమే.

రేటింగ్ : 2. / 5

✍️. దాసరి మల్లేష్

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.