English | Telugu

విశాల్ చేసుకోబోయే ధన్సిక బ్యాక్ గ్రౌండ్  తెలిస్తే షాక్ అవుతారు 

విశాల్ చేసుకోబోయే ధన్సిక బ్యాక్ గ్రౌండ్  తెలిస్తే షాక్ అవుతారు 

'విశాల్(Vishal)కి 2019 వ సంవత్సరంలో తెలుగు యాక్ట్రస్ అనీషా రెడ్డి(Anisha Reddy)తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దీంతో అప్పట్నుంచి విశాల్ పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతు విశాల్ తన పెళ్లి గురించి వెల్లడించాడు.

రీసెంట్ గా చెన్నైలో 'యోగి దా'(Yogi Da)సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి  విశాల్ ముఖ్యఅతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈ సినిమా హీరోయిన్ ధన్సిక(Dhanshika)నేను పెళ్లి చేసుకోబోతున్నాం. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటాం. నా బర్త్ డే డేట్ ఆగస్టు 29 న మా పెళ్లి జరుగుతుందని  చెప్పుకొచ్చాడు. అనంతరం ధన్సిక కూడా మాట్లాడుతు  విశాల్ తో తన పెళ్లి విషయం కన్ఫార్మ్ చేసింది. ఈ సందర్భంగా పలువురు సినీ, మీడియా ప్రముఖులు విశాల్, ధన్సిక కి కంగ్రాట్స్ చెప్పారు.

తమిళనాడు(Thamilanadu)లోని తంజావూరు(Thanjavuru)కి చెందిన ధన్సిక 2006 లో విడుదలైన 'మనతోడు మజైకాలం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2009 లో 'కెంప' అనే కన్నడ చిత్రంతో సోలో హీరోయిన్ గా మారి, ఆ తర్వాత తమిళంలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు ఇరవై చిత్రాల దాకా చేసింది. 'కబాలి' లో రజనీకాంత్ కూతురిగా చేసి  తెలుగు ప్రేక్షకులని పరిచయమయ్యి, షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. యాక్షన్ సినిమాలకి ధన్సిక పెట్టింది పేరు. ప్రస్తుతం చేస్తున్న 'యోగి దా' మూవీలో ఎంతో రిస్క్ తో కూడిన ఫైట్స్ చేసింది. ఇక  కొన్ని రోజుల నుంచి విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా  విల్లుపురం లోని ఒక ఫంక్షన్ లో కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో విశాల్ పెళ్లి వార్త అభిమానుల్లో సరికొత్త ఆనందాన్ని తెచ్చింది. సినిమాల విషయానికి వస్తే విశాల్  ఈ ఏడాది జనవరిలో  'మదగజరాజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.