English | Telugu
'F3' సక్సెస్ మీట్ లో నటి ప్రగతి ఎమోషనల్
Updated : May 30, 2022
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'F3'. దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ మీట్ లో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ప్రగతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
"కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఉండేది. అప్పుడు దేవుడు నాకు 'F2' రూపంలో బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇలాంటి ఒక అవకాశం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. టీ కాఫీ సప్లై క్యారెక్టర్ నుంచి అన్నీ చేశాను. విలన్ పక్కన నిల్చోడం, అందమైన అమ్మ.. సెట్ ప్రాపర్టీలా ఎన్నో సినిమాలు చేశాను. ఇవి కాదు నేను చేయాల్సింది అని తెలిసినా.. సరైన అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఎదురుచూశాను. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైంది" అని ప్రగతి అన్నారు.
"నాకు అమ్మ లేరు.. నాన్న లేరు.. చుట్టాలు లేరు.. ఎవరు లేరు.. కానీ ఈ సినిమా వల్ల నాకు ఇద్దరు అమ్మలు(అన్నపూర్ణమ్మ, విజయమ్మ) దొరికారు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నాక్కూడా చాలా ఇష్టం వాళ్ళంటే." అని ప్రగతి చెప్పారు.