English | Telugu

ఈ వారం మూవీ లవర్స్ కి పండగే.. థియేటర్, ఓటిటి రిలీజ్ ఇవే 

-ఈ వారం సినిమా పండగ
-తగ్గేదేలే అంటు పోటాపోటీ
-ది గర్ల్ ఫ్రెండ్ పై భారీ అంచనాలు
-జటాధరా తో సరికొత్త ప్రపంచం

ఏమైనా తెలుగు సినిమా ప్రేమికులు మాములు అదృష్టవంతులు కాదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు సరికొత్త సినీ వినోదాన్ని అందించడానికి పలు చిత్రాలు వేగంగా ముస్తాబవుతున్నాయి. థియేటరే కాదు మేము సైతం వినోదాన్ని అందించే విషయంలో తగ్గేదేలే అంటు ఓటిటి సంస్థలు కూడా తమ దగ్గర ఉన్న సినీ వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యాయి. మరి వినోదాల జాతర ని చూసేద్దాం.

నవంబర్ 7 న నాలుగు చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వాటిల్లో వరుస విజయాలతో దూసుపోతున్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్' ఒకటి. కథనం మొత్తం ఆమె చుట్టూనే తెరకెక్కడంతో మేకర్స్ ఆమె ఇమేజ్ కి తగ్గట్టుగా నిర్మించారు. రష్మిక కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ. లెజండ్రీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకుడు. దీన్ని బట్టి గర్ల్ ఫ్రెండ్ క్వాలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. ప్రచార చిత్రాలు కూడా బాగుండటంతో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. విభిన్న చిత్రాల కథానాయకుడు సుదీర్ బాబు నుంచి 'జటాధర' కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది.

అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాల చుట్టు జటాధర తెరకెక్కింది. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ మిస్టరీ సబ్జెట్ కావడంతో థియేటర్స్ లో సరికొత్త ప్రపంచం ప్రత్యక్షం కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో కనిపించడం స్పెషాలిటీ. ఇక క్రైమ్ ఇన్విస్టిగేషన్ గా తెరకెక్కిన ఆర్యన్ అనే తమిళ చిత్రం కూడా నవంబర్ 7 న థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకులని ఇప్పటికే పరిచయమైన విష్ణు విశాల్ హీరో. పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ప్రచార చిత్రాలైతే ఆసక్తిని కలుగచేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్న తిరువీర్ ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో తో మరో మారు నవంబర్ 7 నే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఓటిటి వేదికగా చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ లో
నవంబర్ ౩ న ఇన్ వేవ్స్ అండ్ వార్ (హాలీవుడ్ మూవీ)
నవంబర్ 7 న బారాముల్లా(హిందీ).. ఈ రెండు కూడా సినిమాలే

అమెజాన్ ప్రైమ్ లో

నవంబర్ 2 రాబిన్ హుడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
నవంబర్ 3 నైస్ టూ నాట్ మీట్ యు(కొరియన్ వెబ్ సిరీస్)

Also Read:మన శంకర వరప్రసాద్ గారి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి!

జియో హాట్ స్టార్
నవంబర్ 4 బాడ్ గర్ల్ మూవీ(తమిళ్)
నవంబర్ 5 ది ఫెంటాస్టిక్ 4 (ఇంగ్లీష్)

సోనిలీవ్
నవంబర్ 7 మహారాణి వెబ్ సిరీస్ (హిందీ)

ఈ విధంగా థియేటర్స్ లోనే కాకుండా ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమైన చిత్రాలన్నీ కూడా విభిన్నమైన కధాంశాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయనున్నాయి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.