English | Telugu

ఒకప్పుడు చిరు.. ఇప్పుడు అనంత్ శ్రీరామ్.. బంగీ జంప్ ధీరులు

ఒకప్పుడు చిరు.. ఇప్పుడు అనంత్ శ్రీరామ్.. బంగీ జంప్ ధీరులు

అనంత్ శ్రీరామ్ ఏది చేసిన అందులో ఒక అది ఒక ఇది ఉంటుంది. ఆయన ఎం మాట్లాడినా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన్ని చూసి తెలుగు భాష కూడా గర్వపడుద్ది. అలాంటి శ్రీరామ్ అల్లరి మాములుగా ఉండదు. ఎక్కడున్నా డాన్సులు, పాటలు ఇక ఆయన ఇష్టం.. అలా ఉంటుంది వ్యవహారం. ఐతే ఆయన లడఖ్ వెళ్లారు రీసెంట్ గా. అక్కడ బంగీ జంప్ చేసి దాని ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియోలో షేర్ చేశారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. 

"లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన బంగీ జంపింగ్ సైట్‌ లో నేను బంగీ జంప్ చేసాను. ఆ థ్రిల్ మాములుగా లేదు. 190 అడుగుల ఎత్తు నుంచి కిందకు జంప్ చేయడం మరపురాని అనుభూతి" అని రాశారు. ఇక బంగీ జంప్ చేసి వచ్చాక  " నేను నమ్మింది నా అంకెల్ని మాత్రమే. 3 , 2 , 1 అన్న తర్వాత నేను దూకకపోతే జన్మలో నేను దూకలేను అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. దూకిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఒక్కసారి కిందకి స్పీడ్ గా వెళ్లి ఆగిన తర్వాత నేను మనిషినా గాలిపటాన్నా , మనిషినా మేఘాన్నా అన్న అనుభూతి కలిగింది. ఇలాంటి అనుభూతి ప్రతి ఒక్కరు పొందాలి" అన్నాడు. 

దీంతో నెటిజన్స్ అనంత శ్రీరామ్ ని పొగిడేస్తున్నారు. "అనంత శ్రీరామ్ గారు ఇంత  సాహసం చేయడానికి గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి సార్ ... అప్పుడెప్పుడో మా గురువుగారు మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు బావగారు బాగున్నారా మూవీలో... తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు... ఐ లవ్ యు సార్ మీరు ఇలాంటి రిస్కులు చేయకండి సార్. మీ పెన్ను కలానికి మేము చాలా పెద్ద ఫ్యాన్స్...ఈ వయసులో మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి..." అంటూ కామెంట్స్ చేశారు.

ఒకప్పుడు చిరు.. ఇప్పుడు అనంత్ శ్రీరామ్.. బంగీ జంప్ ధీరులు