English | Telugu

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో!

ఇటీవల వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) ఘటన తెలుగునాట సంచలనమైన సంగతి తెలిసిందే. ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై.. తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లైవ్ లో ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రణీత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఘాటుగా స్పందించడంతో.. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చేరింది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా అందరూ స్పందించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసు శాఖ కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయడమే కాకుండా.. అతనిని అరెస్ట్ చేసింది.

ప్రణీత్ హనుమంతు ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ సర్కార్ కి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు తెలిపిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్వయంగా కలిశాడు. సోషల్ మీడియాను దుర్వినియోగం పైన మరియు పిల్లలపై వేధింపులను అరికట్టడానికి తగిన చర్యలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సాయి ధరమ్ తేజ్ కృతఙ్ఞతలు తెలిపాడు.

 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో!