English | Telugu
పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో రిలీజ్
Updated : Mar 21, 2011
ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో విడుదలకు ముందుగా సతీష్ అండ్ ట్రూప్ వారిచే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. అనంతరం 'ఖుషి' మురళీ ధర్, హేమచంద్ర, వేణు, శ్రావణ భార్గవి వంటి గాయకులు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలను పాడి అభిమానులను అలరించారు. అనంతరం డ్రమ్మర్ శివమణి తన డ్రమ్స్ తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన వినోదాన్ని పంచారు. తర్వాత ఈ సినిమా ట్రైలర్ ని రెండు సార్లు అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించారు.