English | Telugu
పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో రిలీజ్ లో గణేష్
Updated : Mar 21, 2011
అనంతరం నిర్మాత గణేష్ చాలా ఎమోషనల్ గా ప్రసంగిస్తూ " ఒకసారి మాట పెదవి దాటిందా...ఆ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనం. ఆయన తర్వాతే నా భార్య కూడా. ఆయన రుణం ఎలా తీర్చుకోను. ప్రాణం ఇచ్చా...? గొంతు కోసుకోనా...? రక్తం ఇచ్చా...? ఆయన కోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. ఆయనతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కి పోతుంది. సిగిరెట్, మందు వంటి వ్యసనాల్లా పవన్ కళ్యాణ్ తో పరిచయం అయిన ఎవరికైనా ఆయనతో మాట్లాడటం అనేది ఒక వ్యసనంలా ఉంటుంది.
అలాంటి మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను నిర్మాతను చేశారు. రేపు మీలో ఎవరినన్నా నిర్మాతను చేయగలరు. ఇక మా సత్తిబాబు గారు. నేనున్నాన్రా అని నన్ను ముందుకు నడిపిన వ్యక్తి. ఇక మా సినిమాకి, పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే అద్భుతమైన సంగీతాన్నిచ్చిన మణన్నకి నా కృతజ్ఞతలు." అని అన్నారు.