English | Telugu

నాని, సుజిత్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

నాని, సుజిత్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే సాహో, ఓజీ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన సుజిత్.. ఈసారి నాని కోసం ఓపవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని రెడీ చేశారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త లుక్‌లో ఈ సినిమాలో నాని కనిపించబోతున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమా నానికి ఒక కొత్త ఇమేజ్‌ని తెస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్‌డేట్ అందర్నీ షాకింగ్‌కి గురి చేస్తోంది. ఇప్పటి వరకు టాప్ హీరోలతో జోడీ కట్టిన పూజా హెగ్డే ఈ సినిమాలో నాని సరసన నటించబోతోందని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్‌గా ఇది హిట్ పెయిర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక మేకింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్ట్ విషయంలో సుజిత్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం