English | Telugu

తాప్సీ 'మొగుడు' గోపీచంద్

తాప్సీ 'మొగుడు' గోపీచంద్ అంటే వింటానికే ఇబ్బందిగా ఉందికదూ. తాప్సీ 'మొగుడు' గోపీచంద్ నిజంగా కాదులెండి. కృష్ణ వంశీ దర్శకత్వంలో, గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం"మొగుడు". ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా నటించటానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించటం ఇదే తొలిసారి. తాప్సీ గతంలో మంచు మనోజ్ కుమార్ సరసన "ఝుమ్మంది నాదం" చిత్రంలోనూ, మంచు విష్ణు వర్థన్ సరసన "వస్తాడు నారాజు" వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నటిగా తాప్సీకి మంచి పేరు లభించింది. అలాగే గోపీచంద్ ఇటీవల హీరోగా నటించిన "వాంటెడ్" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపయ్యింది. అందువల్ల మళ్ళీ ప్రేక్షకాభిమానం సంపాదించాలంటే గోపీచంద్ కి కూడా తప్పని సరిగా ఒక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.