English | Telugu

Akhanda 2: ఓవర్ సీస్ ప్రీ సేల్స్ రికార్డు ఇదే 

అభిమానుల హంగామా
ఏంటి ఆ రికార్డు
కెరీర్ లోనే ఫస్ట్ టైం

మరికొన్నిగంటల్లో గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో డెవోషనల్ యాక్షన్ డ్రామా 'అఖండ 2'(Akhanda 2)ప్రీమియర్స్ తో అడుగుపెట్టనున్నాడు. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతారవరణం నెలకొని ఉంది. బాలకృష్ణ కెరీర్ లోనే మునుపెన్నడూ లేని విధంగాఅడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. దీంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా బాలయ్య రికార్డ్స్ కలెక్షన్స్ సాధించడం ఖాయమనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది.

ఇందుకు నిదర్శనంగా యూఎస్ కి సంబంధించిన ప్రీ సేల్స్ లో ఈ రోజు ఉదయం వరకు 250 k డాలర్స్ ని రాబట్టింది. బాలయ్య కెరీర్ లోనే ఇంత ఫాస్ట్ గా బుకింగ్ జరిగిన మూవీ అఖండ 2 నే కావడం గమనార్హం. సినీ ఎనలిస్ట్ లు కూడా 250 k డాలర్స్ వసూళ్లపై స్పందిస్తు ప్రీమియర్స్ బిగిన్ అయ్యే లోపే 350 k డాలర్స్ ని చెరుకోవడం ఖాయమని అంటున్నారు.

also read: దురంధర్ కి హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు

ఇక యూఎస్ ప్రీమియర్ రికార్డుపై అభిమానులు స్పందిస్తు నిన్న అఖండ 2 ని యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మోక్ష మూవీస్ అఖండ 2 గురించి మాట్లాడుతు రిలీజ్ డేట్ తేడా జరగడం వలన అఖండ 2 కి యూఎస్ లో ఎక్కువ థియేటర్స్ ని కేటాయించలేకపోతున్నామని చెప్పారు. అయినా సరే బాలయ్య యూఎస్ సెల్యులాయిడ్ పై రికార్డులు సృష్టిస్తున్నాడని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.