English | Telugu

ఓటీటీలోకి 'ది గోట్ లైఫ్'...

ఓటీటీలోకి 'ది గోట్ లైఫ్'...

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్). 'ఆడుజీవితం' (Aadujeevitham) అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. థియేటర్లలో మిస్ అయినవారు.. ఓటీటీలో చూడాలని ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దాదాపు నాలుగు నెలలకు 'ఆడుజీవితం' ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

'ది గోట్ లైఫ్' (The Goat Life) డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోకి 'ది గోట్ లైఫ్'...