English | Telugu

మహేష్ బాబు 'ది బిజినెస్ మ్యాన్' కథ

మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' కథ ఏమిటనేది అందరికీ ఉత్కంఠ కలిగించే అంశంగా మారింది. వివరాల్లోకి వెళితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మించబోయే చిత్రం "ది బిజినెస్ మ్యాన్". ఈ చిత్రానికి క్యాప్షన్ గా "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్" అని నిర్నయించారు. గతంలో పూరీ జగన్నాథ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన "పోకిరి" చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొట్టింది.

అందుకనే మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ఈ చిత్రం కథ మీద అందరికీ అందుకే ఆసక్తి ఏర్పడేది. ఇక ఈ ది బిజినెస్ మ్యాన్ చిత్రం కథ విషయానికొస్తే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ జరుగుతుందని సమాచారం. మామూలుగా మాఫియా బ్యాచ్ అంటే గతంలో రామ్ గోపాల వర్మ తీసిన కంపెనీ, సత్య చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయినా ఈ మాఫియా అంటే ముంబాయి లేదా ఉత్తర భారతదేశానికి బాగా పరిచయముంటుంది కానీ, మన తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యవహారం.

దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్, షకీల్ అహ్మద్, అబూ సలేం వంటి అంతర్జాతీయ మాఫియా బ్యాచ్ గురించి మనవాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదు. కాని పురీ జగన్నాథ్ ఆ రేంజ్‍ మనుషుల కథతోనే ఈ "ది బిజినెస్ మ్యాన్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.