English | Telugu

తండేల్ పై ప్రేక్షకుల రియాక్షన్..శ్రీకాకుళం అంటే ఎర్రబస్సు కాదు  

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)లేడీ పవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే సాయిపల్లవి(Sai Pallavi)కాంబోలో తెరకెక్కిన 'తండేల్'(Thandel) మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యకారుల జీవితంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

దీంతో ఈ రోజు ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 'తండేల్' మూవీ ఆడుతున్న థియేటర్స్ కి పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యాన్స్, ప్రజలు తరలి వెళ్లారు.మూవీ చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని,కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టామని చెప్పారు. శ్రీకాకుళం అంటే ఎర్రబస్ కాదు ఒక ప్రభంజనం.శ్రీకాకుళం జిల్లా వాసులుగా 'తండేల్' చూసీ చాలా గర్వపడుతున్నాం.చైతు,సాయి పల్లవి లు తమ క్యారెక్టర్స్ లో జీవించారని చెప్పుకొచ్చారు.

కొంత మంది మత్స్యకారులు కూడా మాట్లాడుతు'తండేల్' చూస్తుంటే మా జీవితాలని చూసినట్టుగా ఉందని,ఇలాంటి సినిమాని అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన గీతా ఆర్ట్స్అధినేత అల్లు అరవింద్,దర్శకుడు చందు మొండేటి,నాగ చైతన్య,సాయిపల్లవి కి చాలా ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.