English | Telugu
మొదలైన ఎన్నికల సందడి.. ఓటు వేసిన టాలీవుడ్ హీరోలు!
Updated : Nov 29, 2023
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. ఉదయం 7 గంటల నుంచే అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో కలిసి క్యూలో నిలబడి తమ ఓటు వేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని ఎంతో మందికి ఈ విషయంలో స్ఫూర్తినిస్తున్నారు.