English | Telugu
‘యానిమిల్’కి సెన్సార్ ఇక్కట్లు.. ఎన్నో మార్పులు చెయ్యాలని సూచన!
Updated : Nov 30, 2023
‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’ వంటి సంచలన విజయాల తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన మరో ఎమోషనల్ థ్రిల్లర్ ‘యానిమల్’. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి మునుపెన్నడూ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఐదు కట్స్ చెప్పారని, కొన్ని ఇంటిమేట్ సీన్స్‌ని కూడా తొలగించాలని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని పదాలను కూడా మార్చాలని సూచించారు. ఇప్పుడీ సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాకి సంబంధించి నిడివి గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 3 గంటల 23 నిమిషాలు ఉంది. మొదట 3 గంటల 49 నిమిషాల నిడివితో ఫస్ట్‌కాపీని సిద్ధం చేశారు. రెండు ఇంటర్వెల్స్‌తో సినిమాను రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావించినప్పటికీ, అన్ని గంటలు ఏకధాటిగా సినిమా చూడాలంటే కష్టంతో కూడుకున్న పని అని గ్రహించి మరో 26 నిమిషాల నిడివిని తగ్గించారు. అయితే ఇది కూడా ఆడియన్స్‌కి ఎంతో భారమనే చెప్పాలి. సినిమాలో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోతారు కాబట్టి నిడివి విషయంలో ఆడియన్స్ ఎలాంటి ఇబ్బందీ పడరని దర్శకుడు సందీప్‌రెడ్డి చెబుతున్నాడు.