English | Telugu
'త్రిశంక్' కూడా కేనన్ 5డి తోనే- వర్మ
Updated : Mar 21, 2011
తన ఈ "త్రిశంక్" చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నా కూడా తాను ఈ "త్రిశంక్" చిత్రాన్ని "కేనన్ 5-డి" కెమెరాతోనే నిర్మించనున్నానని రామ్ గోపాల వర్మ ఘంటాపధంగా నొక్కి వక్కాణిస్తున్నారు.
దీనికి కారణమేంటని అడిగితే "మనం ఏ కెమెరాతో మూవీ తీశామో సగటు ప్రేక్షకుడికి అనవసరం. సినిమా బాగా కనపడుతుందా...? లేదా...? సినిమాలో కంటెంట్ ఎంత ఆసక్తికరంగా ఉంది అన్నది మాత్రమే సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు..అంతే కానీ మనం యారీ-3 కెమెరా వాడామా, బి 435 కెమెరా వాడామా లేక పేనావిజన్ కెమెరా వాడామా, మూవీ మోషన్ కెమెరా వాడామా అనేది వారికి అనవసరం. అందుకే నేను నా ప్రతి చిత్రాన్నీ "కేనన్ 5-డి" కెమెరాతోనే నిర్మిస్తాను" అని రామ్ గోపాల వర్మ మీడియాకు తెలియజేశారు. దటీజ్ రామ్ గోపాల వర్మ...మిగిలిన దర్శకులు కూడా ఇలా విభిన్నంగా ఎందుకు ఆలోచించరో...