English | Telugu
11న శర్వానంద్ రన్ రాజా రన్
Updated : Jun 28, 2014
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన తొలి ప్రయత్నం ’మిర్చి‘తో సూపర్ డూపర్ హిట్ ని సాధించిన నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న చిత్రం ’రన్ రాజా రన్‘. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ’విశ్వరూపం 2‘ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘిబ్రాన్.యం చక్కటి సంగీతాన్ని అందించారు. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ’మిర్చి‘కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మధి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమాని జులై 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.