English | Telugu

'సర్కారు వారి పాట' బ్రేక్ ఈవెన్ కష్టమే.. బయ్యర్లకు ఇన్ని కోట్ల నష్టమా?

సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పలు టాలీవుడ్ స్టార్ల సినిమాలు బయ్యర్లకు నష్టాలను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ టికెట్ ధరల కారణంగా 'భీమ్లా నాయక్', 'పుష్ప: ది రైజ్' వంటి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొని కూడా నష్టాలను చూశాయి. ఆ తర్వాత టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ 'రాధేశ్యామ్', 'ఆచార్య' వంటి సినిమాలు నెగిటివ్ టాక్ తెచ్చుకొని బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. అలాగే ఇప్పుడు 'సర్కారు వారి పాట' కూడా బయ్యర్లకు నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్టులో చేరే అవకాశం కనిపిస్తోంది.

మే 12న విడుదలైన 'సర్కారు వారి పాట' మొదటిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ కలెక్షన్స్ రాబడుతూ రెండు వారాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 14వ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.27 లక్షల షేర్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో 87.70 కోట్ల షేర్(132 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ లో 97.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా దాదాపు 90 శాతం రికవరీ సాధించింది. 14 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 32.77 కోట్ల షేర్(36 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 11.31 కోట్ల షేర్(13 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 43.62 కోట్ల షేర్(48.50 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ గా 14వ రోజు 35 లక్షల షేర్ వసూలు చేసిన 'సర్కారు వారి పాట' ఇప్పటిదాకా 106.65 కోట్ల షేర్(171.30 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్ గా 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 14 కోట్ల దూరంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. పైగా రేపు(మే 27) 'F3' సినిమా విడుదల ఉంది. అంటే 'సర్కారు వారి పాట' కలెక్షన్ల వేట దాదాపు ముగిసినట్లే. ఫుల్ రన్ ముగిసేసరికి బయ్యర్లకు ఈ సినిమా సుమారుగా 12 కోట్ల నష్టం మిగిల్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.