English | Telugu
కోట మృతి.. రాజమౌళికి కోపం తెప్పించిన వ్యక్తి..!
Updated : Jul 14, 2025
కొందరు అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. సెలబ్రిటీ ఏ పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా.. సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి అలాంటి అనుభవమే ఎదురైంది.
ఆదివారం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎందరో సినీ ప్రముఖులు కోట పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కోట పార్థివదేహానికి నివాళులు అర్పించి.. రాజమౌళి తిరిగి తన కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో.. ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు పదే పదే ప్రయత్నించాడు. మొదట రాజమౌళి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి రాజమౌళికి అడ్డుగా వెళ్ళి సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాడు. దీంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్? అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆ వ్యక్తి తీరుని తప్పుబడుతున్నారు. అభిమానానికి కూడా లిమిట్ ఉంటుందని, అలాంటి విషాద ఘటన చోటు చేసుకున్న సమయంలో సెల్ఫీ కోసం ఎగబడటం కరెక్ట్ కాదని అంటున్నారు.