English | Telugu
ఢిల్లీ భామతో రామ్ 'పండగ చేస్కో'
Updated : May 6, 2014
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో వరుసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే గోపిచంద్, మంచు మనోజ్, నితిన్ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న ఈ భామకి తాజాగా హీరో రామ్ 'పండగ చేస్కో' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. మొదట ఈ చిత్రంలో హన్సిక ను హీరోయిన్ గా తీసుకోగా, ఆమెకి కాల్ షీట్ల ప్రాబ్లెం రావడంతో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో రకుల్ ప్రీత్ కి ఈ అవకాశం దక్కింది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే వరుసగా భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రకుల్ ఈ సినిమాలతో తన టాలెంట్ నిరూపించుకుంటే త్వరలోనే టాప్ లీగ్ లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.