English | Telugu

'ఎన్టీఆర్'ని టెన్షన్ పెడుతున్న'అల్లు అర్జున్'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ టెన్షన్ పెడుతున్నాడట! లేటెస్ట్ గా అల్లు అర్జున్ రేసుగుర్రం మూవీ 50కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన 25రోజులలో ఈ సినిమా 51కోట్లు వసూళ్ళు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో అల్లు అర్జున్ 50కోట్ల మార్క్ ని దాటిన హీరోలలో నాలుగోవ స్థానంలో నిలిచాడు. ఈ రేసుగుర్రం దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ లో కలవరం మొదలైందట. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ ఆ తరువాత ఈ రేసులో మెల్లగా వెనుక పడిపోయాడు. అతని కంటే రేసులో వెనుక వచ్చిన హీరోలంతా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటే యంగ్ టైగర్ మాత్రం ఇంతవరకు 50కోట్ల మార్క్ ని అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడట. దాని కోసం తనకి ఆ హిట్ ని ఇచ్చే దర్శకుడి వెతుకులాటలో జూనియర్ నిమగ్నమయ్యాడట. మరీ ఈసారైనా ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం..!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.