English | Telugu
నారా రోహిత్ సమర్పించేస్తున్నాడు
Updated : May 5, 2014
'ప్రతినిధి' సినిమాతో విజయాన్ని అందుకున్న నటుడు నారా రోహిత్ సమర్పకుడిగా మారాడు. నారా రోహిత్ సమర్పణలో రవిపనస ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్లో 'నలదమయంతి' అనే చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా కొవేరా అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా నిఖితా నారాయణ్ నటించనుంది. మరో హీరోయిన్ ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. తొలి సన్నివేశానికి నిర్మాత రవి పనస క్లాప్ కొట్టగా, హీరో శ్రీవిష్ణు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మొదటి షెడ్యుల్ మే 12వరకు జరుగుతుందని, రెండవ షెడ్యుల్ మే 20 నుండి జూన్ 20వరకు చేయబోతున్నట్లుగా తెలిపారు. సంగీతం సత్య.