English | Telugu

ఇక ఐస్‌క్రీం - 2 కూడా తినొచ్చు


అంచనాలు తారుమారు చేస్తూ ఐస్‌క్రీం సినిమా విజయం సాధించడంతో రాం గోపాల్ వర్మ ఈ సినిమా సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు తెలుస్తోంది. మీడియాతో ఆయనకు జరుగుతున్న వివాదం గురించి, ఐస్‌క్రీం సినిమా మేకింగ్ గురించి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని కూడా అందులో చేర్చారు. ఐస్‌క్రీం సినిమా ఫ్లాప్ అయి నష్టం మిగులుస్తుందని జోష్యం చెప్పిన ప్రొడ్యూసర్ తనంతట తానుగా వచ్చి ఆర్‌జీవీతో ఐస్‌క్రీం-2 సినిమా తీస్తున్నారని ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. రెండు లక్షల పన్నెండు వేలు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చెబితే గుండాగిపోతుందని ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు.