English | Telugu
'బలగం' సినిమా గురించి గ్రూప్-4 పరీక్షలో వచ్చిన ప్రశ్న!
Updated : Jul 1, 2023
'బలగం' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని తెలంగాణలోని ప్రతీ జిల్లాలో,ప్రతీ మండలంలో ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేసుకొని మరీ చూసారు. ఈ సినిమా చూసి ఎంతో మంది విడిపోయిన వారు మళ్ళీ కలిసారు. ఎన్నో సంవత్సరాల నుండి మాట్లాడుకోని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అంతటి ఇంపాక్ట్ ఇచ్చిన ఈ 'బలగం', ఇప్పుడు మరో ఘనతని సాధించింది.
వేణు ఉడుగుల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమా వెండితెరపై బ్లాక్ బస్టర్ అయింది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న థియేటర్లలో విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఆ తర్వాత స్కూల్స్ లో పంచాయతీలలో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఈ సినిమాని ప్రదర్శించడంతో అంతటా అభినందనలు లభించాయి. కొమురయ్య పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ.. ప్రతీ ఇంటి కథలాగా తీర్చిదిద్దాడు వేణు ఎల్దండి.
అయితే తాజాగాతెలంగాణలో జరిగిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమా గురించి ఒక ప్రశ్న వచ్చింది. దానికి సంబంధించిన ప్రశ్నని డైరెక్టర్ వేణు ఎల్దండి తన సోషల్ మీడియాలో పోస్డ్ చేసాడు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, కొమురయ్య పాత్రధారి వివరాలు ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి పలు అవార్డులు వచ్చాయి. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రతీ ఒక్కరిని కదిలించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ పరీక్షల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్న అడగడం చాల గర్వంగా ఉందని వేణు ఎల్దండి షేర్ చేసుకున్నాడు.