English | Telugu
రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టేనా?
Updated : Jul 2, 2023
ఈ మధ్య కియారా - సిద్ధార్థ్ పెళ్లి జరిగినప్పటి నుంచి నెక్స్ట్ వెడ్డింగ్ లాక్ ఎవరికీ అంటూ లైమ్ లైట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు నెటిజన్లు. ఎక్కువ మంది దృష్టి రకుల్ ప్రీత్ సింగ్ మీద ఉంది ఇప్పుడు. ఆమె పెళ్లి అక్టోబర్‌లో ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి తాజాగా స్పందించారు రకుల్ ప్రీత్‌సింగ్. నా పెళ్లి జరిగినప్పుడు, అందరికన్నా ముందు ప్రపంచానికి నేనే చెబుతాను అంటూ పాత మాటనే మరోసారి కొత్తగా చెప్పారు.
రకుల్ ప్రీత్‌సింగ్ సౌత్ లో స్టార్ హీరోలతో నటించారు. డెడికేటెడ్ ఆర్టిస్ట్ గా, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. నార్త్ మీద ఫోకస్ పెంచిన తర్వాత సీనియర్ హీరోలతో సినిమాలు చేశారు. నాన్‌స్టాప్‌గా అవకాశాలను రాబట్టుకుంటున్నారు గానీ, పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే యాక్టర్ టర్న్డ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డారు. తమ రిలేషన్‌షిప్ గురించి అక్టోబర్ 2021లో ఓపెన్‌గా షేర్ చేశారు.
ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం అంటూ ముందు వార్తలొచ్చాయి. కాదు, డిసెంబర్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ప్లాన్ చేసుకుంటున్నారు అన్నారు. అయితే లేటెస్ట్ గా అక్టోబర్‌కే ఫిక్స్ అయ్యారని వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ రిలేషన్‌షిప్‌ని ఓపెన్ చేసిన సేమ్ మంత్‌లోనే మ్యారేజ్ కూడా ఉంటుందని చెప్పారు.
దీని గురించి తాజాగా మాట్లాడారు రకుల్ ప్రీత్‌సింగ్. "ఇంకా పెళ్లి గురించి ఏమీ అనుకోలేదు. నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో, మా అమ్మానాన్నలు నన్ను అడగలేదు. మీడియా మాత్రం డేట్ ఫిక్స్ చేసేస్తోంది. ఈ వార్తలను నేనెలా డీల్ చేస్తానో చూడాలని తాపత్రయపడుతున్నారు మా తల్లిదండ్రులు. నా లైఫ్‌ని నేనెలా డిజైన్ చేసుకుంటానో చూడాలన్నది వారి కోరిక. భగ్నానితో ప్రేమ గురించి చెప్పినట్టే, ఈ రిలేషన్‌షిప్ నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ గురించి కూడా నేను అందరితో పంచుకుంటాను" అని అన్నారు.