English | Telugu

ప్రభుదేవా షాకింగ్ కామెంట్



కోరియోగ్రాఫర్ నుంచి హీరోగా, హీరో నుంచి డైరెక్డర్ గా మారిన ప్రభుదేవాకు బాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో క్రేజ్ వుంది. ఆయన డైరెక్డ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర మంచి కలెక్షన్లు కురిపించడమే ఇందుకు కారణం. ఇక ప్రభుదేవా తన డాన్సులు, డైరెక్షన్ల వల్లనే కాకుండా ప్రేమ, పెళ్లి వ్యవహారాల వల్ల కూడా వార్తల్లోకి వచ్చాడు. నయన తారతో పెళ్లి వరకూ వచ్చిన ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. ఈ తంతు కోసం మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ప్రేమ, పెళ్లి రెండు వికటించటంతో ప్రభుదేవా కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. వరుసగా హిందీలో చిత్రాలు రూపొందిస్తూ బిజీగా మారాడు. లేటెస్టుగా ప్రభుదేవా ఒక బాలీవుడ్ భామతో షికార్లు కొడుతున్నాడని మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని కూడా ప్రచారం మొదలైంది. ఈ వార్తలను ప్రభుదేవా ఖండించినట్లు తెలుస్తోంది. పెళ్లి, ప్రేమే కాదు, అసలు తనకు ఏ ఆడతోడు అవసరం లేదన్నాడట ప్రభుదేవ. ఈ వైరాగ్యానికి కారణం ఏమిటో మరి.