English | Telugu

క్రేజ్ కోసం ప్రభాస్, గోపీచంద్‌లు


ప్రస్థానం, గమ్యం లాంటి విభిన్న తరహా చిత్రాలతో నటుడిగా డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్న శర్వానంద్‌ లేటెస్టు చిత్రం "రన్ రాజా రన్''. నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ సినిమాలకు క్రేజ్ తెచ్చిపెట్టెందుకు టాలీవుడ్ హీరోలు ఓ చక్కటి ప్రయత్నం చేశారు. "రన్ రాజా రన్'' ఆడియో ఫంక్షన్‌కి బెస్ట్ బడ్డీస్ ప్రభాస్, గోపిచంద్ గెస్ట్‌లుగా వచ్చారు.


శర్వానంద్, సీరత్ కపూర్ లు హీరోహీరోయిన్లుగు నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ నటించిన మిర్చీ చిత్రం బ్యానర్‌ కూడా ఇదే. గోపిచంద్ లేటెస్ట్ చిత్రం కూడా ఈ బ్యానర్ పైనే రూపొందుతోంది. అలా ప్రభాస్‌, గోపీచంద్‌లకు నిర్మాతలతో వున్న రిలేషన్స్ వల్ల కూడా వీరు ఆడియో ఫంక్షన్ లో పాల్గొని వుండవచ్చు అంటున్నారు.

ఏమైనా "రన్ రాజా రన్'' ఆడియో ఫంక్షన్‌కి ఈ ఇద్దరు హీరోలు రావడం వల్ల కొత్త సందడి నెలకొంది. గతంలో శర్వానంద్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామెడీ, ప్రేమ అంశాలతో రూపొందిన ఈ చిత్రం శర్వానంద్ కు కొత్త ఇమేజ్‌ని తెస్తుందని ఆశిస్తున్నారు.