English | Telugu
కిక్ ట్రెయిలర్ అదిరింది ...
Updated : Jun 16, 2014
ఎప్పుడో వచ్చిన కిక్ సినిమా ట్రెయిలర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా.. అదే టైటిల్ తో సల్మాన్ హీరోగా వస్తున్న హిందీ చిత్రం కిక్ గురించి.. జూన్ 15న ఈ సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయింది. రీలీజ్ అయిన ఒక్క రోజులోనే 13 లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోని వీక్షించారు. ట్రెయిలర్ చూసినవారు కిక్కాస్ గా వుందంటున్నారు.
తెలుగులో రవితేజ నటించిన కిక్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. హిందీలో సల్మాన్ ఖాన్ పవర్‌ఫుల్ యాక్షన్ ట్రెయిలర్, ప్రేక్షకులను ఇప్పటికే కట్టిపడేస్తోంది. హిందీలోనూ ఈ చిత్రం తప్పకుండా పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని అప్పుడే టాక్ మొదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాక్వెలెన్ ఫెర్నాండెజ్ నటించింది. డెవిల్ పేరుతో, డెవిలిష్ లుక్‌తో కనిపించిన సల్మాన్ ఈ చిత్రంలో యాక్షన్, కామెడీ రెండు సమపాల్లలో పండించబోతున్నాడు.
తెలుగు రీమేక్‌లను హిందీలో సక్సెస్ చిత్రాలుగా మలచుకోవడంలో సల్మాన్ దిట్ట. పోకిరి, రెడీ చిత్రాలు హిందీలో రీమేక్ చేసి సక్సెస్ పొందిన సల్మాన్ ఈ చిత్రం ద్వారా మరో హిట్ సాధిస్తాడనటంలో సందేహం లేదనిపిస్తుంది.
"మేరే బారేమే ఇత్నా మత్ సోచ్.. దిల్ మే ఆతా హు ,సమజ్ మే నహి" - పవర్ ఫుల్ డైలాగ్‌తో రిలీజ్ చేసిన ట్రెయిలర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. సాజిద్ నదియావాలా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల25 న, ఈద్ సమయంలో రిలీజ్ కి సిద్దం చేస్తున్నారు.