English | Telugu

ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!

ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) జోడి తెరపై చూడటానికి చాలా బాగుంటుంది. నిజ జీవితంలో మంచి స్నేహితులు కూడా. అందుకే వీరు పెళ్ళి చేసుకుంటే చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే అభిమానుల కోరిక మాత్రం తీరేలా కనిపించడంలేదు. ఇలాంటి సమయంలో ఒక వీడియో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..?

ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. కొందరు దీనిని చెడుకి ఉపయోగిస్తుంటే, మరికొందరు మాత్రం దానితో అందమైన జ్ఞాపకాలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒకరు ప్రభాస్-అనుష్క పెళ్ళి అయినట్లుగా ఒక వీడియోని క్రియేట్ చేశారు.

ఈ ఏఐ వీడియోలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పురోహితుడిగా కనిపిస్తున్నారు. వివిధ పరిశ్రమలకు చెందిన సినీ తారలు తరలివచ్చినట్టుగా చూపించారు. రామ్ చరణ్ డోలు కొట్టడం, మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ సరదా కబుర్లు, రాజమౌళి-కీరవాణి డ్యాన్స్ చేయడం, కొరియన్ నటుడు డాన్ లీకి బాలకృష్ణ వడ్డించడం వంటివి వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ఇక చివరిలో ప్రభాస్-అనుష్కలను కృష్ణంరాజు దీవించడం హృదయాన్ని హత్తుకుంది.

Also Read: మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ!

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ పెళ్ళి చూడాలన్న కోరిక తీరిపోయింది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ "ఏంటిది ఏఐ" అంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో మరింత వైరల్ అవుతోంది.