English | Telugu
నిర్మాతగా పవన్ కళ్యాణ్.. మొదటి సినిమా రామ్ చరణ్ తో!
Updated : Jul 23, 2025
రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించారు. దానికితోడు డిప్యూటీ సీఎం కూడా కావడంతో.. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా రాజకీయాలపైనే ఉంది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఇక కొత్త సినిమాలు చేయకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అభిమానులు మాత్రం పవన్ సినిమాలు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా పవన్ స్పందించారు.
'హరి హర వీరమల్లు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం నా ప్రాధాన్యత రాజకీయాలకే. అయితే నాకు సినిమా తప్ప ఇంకోటి తెలీదు. ఇక్కడే అనుభవం ఉంది. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో నటుడిగా సినిమాలు చేయలేను. సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నాను." అని పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను పవన్ ఎప్పుడో స్థాపించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఛల్ మోహన్ రంగ' వంటి సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అప్పట్లో రామ్ చరణ్ తోనూ ఓ సినిమా ప్లాన్ చేశారు. 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ ను ఇప్పుడు యాక్టివ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నారని అర్థమవుతోంది. మరి పూర్తిస్థాయి నిర్మాతగా తన మొదటి సినిమాను రామ్ చరణ్ తో చేస్తారేమో చూడాలి.